మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

HNK: కాజీపేట మండల కేంద్రంలో నేడు పీఎం నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుల చిత్రపటాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు