సబ్సిడితో ప్రభుత్వం విత్తనాలను అందిస్తుంది: AO

సబ్సిడితో ప్రభుత్వం విత్తనాలను అందిస్తుంది: AO

KRNL: పెద్దకడుబూరు మండలంలోని రైతు సేవా కేంద్రాలలో రైతన్నలకు సబ్సిడీతో శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ మండల అధికారిని సుచరిత మంగళవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. రబీ పంటల కోసం సబ్సిడీతో శనగ విత్తనాలను ప్రభుత్వం అందిస్తుందని, క్వింటా ధర రూ. 7,800 ఉండగా, 25శాతం సబ్సిడీతో రూ. 1,950 పోనూ, కేవలం రూ. 5,850 మాత్రమే చెల్లించి కొనుగోలు చేయాల్సిందిగా కోరారు.