కాంగ్రెస్‌లో చేరిన మాజీ జడ్పీటీసీ

ASF: సిర్పూర్ మండల మాజీ జడ్పీటీసీ అజ్మీర రామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ సిర్పూర్ నియోజకవర్గం ఇంఛార్జి రావి శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట జాగృతి మహిళా మండల అధ్యక్షురాలు అజ్మీర విజయ, మాజీ బీజేపీ వార్డు మెంబర్లు దాదాపు 30 మంది పార్టీలో చేరారు.