VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా రూ.1.46 కోట్ల నిధులతో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను, నాగవరప్పాడు వంతెనపై బ్యూటిఫికేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే రాము బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి వివరాలను కమిషనర్ ఎమ్మెల్యేకు వివరించారు. ఆటంకం లేకుండా డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.