తప్పిన పెను ప్రమాదం

SKLM: జాతీయరహదారిపై కన్నేవలస బీపీసీఎల్ పెద్ద పెట్రోల్ బంకు పార్కింగ్ స్థలంలో ఆదివారం తెల్లవారుజామున ఓ లారీలో మంటలు చెలరేగాయి. లారీ క్యాబిన్లోని స్విచ్ బోర్డుల్లో షార్టు సర్క్యూట్ కావడంతో ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు అదుపు చేశారు. సమీపంలోని ఇతర వాహనాలు, బంకు లోపలికి మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.