రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ సమావేశం

వరంగల్: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్రంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి అన్నారు.