సుంకేసుల రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద

KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్‌కు మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి 1,30,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు 20 గేట్లను ఎత్తి దిగువకు 1,25,660 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కేసీ కెనాల్‌కు 2180 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 0.554 టీఎంసీల నీరు నిల్వ ఉంది.