'ఖమ్మంలో శ్రామికుల సభను జయప్రదం చేయాలి'
ఖమ్మం నగరంలోని స్థానిక గిరి ప్రసాద్ భవన్‌లో శనివారం సీపీఐ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంత రావు మాట్లాడుతూ.. డిసెంబర్ 26న ఖమ్మంలో జరగబోయే శ్రామికుల సభకు శ్రామికులు, కర్షకులు, రైతులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.