కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు
PLD: సత్తెనపల్లి పట్టణంలో యువ న్యాయవాదిపై హెడ్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై స్థానిక బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయదేవత విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ నినాదాలు చేశారు. గురువారం ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఉదయ్ చంద్ర, మాన్‌హ్యాండ్లింగ్‌కు ప్రయత్నించినట్లు న్యాయవాదులు ఆరోపించారు.