సంక్రాంతి సంబరాల ఆహ్వానపత్రిక ఆవిష్కరణ

VZM: గజపతినగరం మండలంలోని తమ్మారాయుడుపేట గ్రామంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ఆహ్వానపత్రికను గురువారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆవిష్కరించారు. హెచ్ఎం కనకల చందర్రావు మాట్లాడుతూ.. ప్రతిభ చూపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సత్కారం, రంగవల్లి పోటీలు, గోమాత ఎద్దులు ప్రత్యేక అలంకరణ పోటీలు జరుగుతాయన్నారు.