రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
KDP: కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి వంతెన సమీపంలో గురువారం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు మేరకు అతను రైలు కింద పడడంతో అతని తల, మొండెం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుడి ఒంటిపై పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ ఉన్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.