న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

BHNG: సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ ముందు కేడోతు తండా గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గత నెల 16వ తేదీన కేడోతు వరుణ్ తేజ్(19) అనుమానస్పదంగా మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులపై అనుమానం ఉందని పిర్యాదు ఇచ్చినా ఎస్సై స్పందించడం లేదని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు స్టేషన్ ముందు నుంచి కదలమని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.