చెరువులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

MDK: అల్లాదుర్గ్ మండల కేంద్రంలోని బట్టికుంట చెరువును ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సందర్శించారు. అల్లాదుర్గ్‌లోని బట్టికుంట చెరువు కట్ట గత 3, 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కుంట గట్టు తెగిపోయింది. దీంతో మాజీ ఎమ్మెల్యే మంగళవారం సందర్శించారు. వరదకు ధ్వంసమైన రోడ్డును, మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు.