మద్యం మత్తులో డ్రైవింగ్.. యువతికి గాయాలు
HYD: జూబ్లీహిల్స్‌లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. యువతి కారు నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. దీంతో డ్రైవింగ్ సీటులో ఇరుక్కుని ఉన్న ఆమెను స్థానికు బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చికిత్స నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.