VIDEO: దుగ్గిరాల వసతి గృహాల్లో అపరిశుభ్రత
GNTR: దుగ్గిరాలలోని స్థానిక ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను జనసేన జిల్లా నాయకులు బుధవారం పరిశీలించారు. టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా లేదని, కొన్ని గదుల్లో లైట్లు వెలగడం లేదని, భోజన సమస్యలు ఉన్నాయని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.