బాపట్ల పేరు వెనుక చరిత్ర తెలుసా..?
బాపట్లకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడి భావనారాయణ స్వామి ఆలయం వల్ల పట్టణానికి 'భావపురి' అనే పేరు వచ్చింది. ఇది 5వ శతాబ్ధానికి చెందిన ప్రాచీన ఆలయం. చోళ రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కాకతీయ రుద్రమదేవి కాలం నాటి శాసనాలు కూడా లభించాయి. కాలక్రమేణా భావపురి అనే పేరు 'బాపట్ల'గా మారింది. చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ఈ క్షేత్రం ప్రతీక.