పిఠాపురంలో ఘోర ప్రమాదం.. బస్సు, ఆటో ఢీ
కాకినాడ: పిఠాపురం మాధవస్వామి కోనేరు సమీపంలో ఓ ప్రైవేటు బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో లగుడు వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.