మహిళల రక్షణ మనందరి బాధ్యత: ఎస్పీ వినీత్

మహిళల రక్షణ మనందరి బాధ్యత: ఎస్పీ వినీత్

NRPT: మహిళలు, బాలికల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ భరోసా ఇచ్చారు. గృహహింస, వేధింపులు లేదా లైంగిక దాడుల వంటి ఆపద సమయాల్లో తక్షణ సహాయం కోసం 181 హెల్ప్‌లైన్ లేదా సఖి వన్ స్టాప్ సెంటర్‌ను 24 గంటలు సంప్రదించవచ్చని, భయం వీడి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.