గాలివాన బీభత్సం... నెలకొరిగిన స్తంభాలు

NRML: లొకేశ్వరం మండలంలో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని ఆయా గ్రామాల్లో బలమైన గాలులు వీయడంతో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు విరిగి వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ఎనిమిది గంటలపాటు అంతరాయం ఏర్పడింది.