వర్షానికి కూలిన ఇల్లు.. తృటిలో తప్పిన ప్రమాదం

KMR: నాగిరెడ్డిపేట మండలంలోని మెల్లకుంట తండాలో అంగోత్ సునీత రేకుల ఇల్లు భారీ వర్షానికి కూలిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే పథకానికి మంచి పేరు వస్తుందని, అధికారులు సత్వరమే స్పందించాలన్నారు.