కొండెక్కిన కోడి ధర.. కొనలేమంటున్న సామాన్యులు
కోనసీమ: అమలాపురంలో ఆదివారం మాంసం ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రతతో కోళ్ల పెంపకం తగ్గడం, రంజాన్ ప్రభావంతో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.370కి చేరింది. ఫారం కోడి రూ.200, మటన్ రూ.800గా ఉండగా.. చేపలు రూ.140 వరకు అమ్ముడవుతున్నాయి. సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.