'రెండో పెళ్లి చేసుకుంటే'.. సీఎం వార్నింగ్
అసోంలో బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సీఎం హిమంత బిస్వా శర్మ క్లారిటీ ఇచ్చారు. 'ఇకపై భార్య ఉండగా మరొకరిని పెళ్లి చేసుకుంటే 7 ఏళ్లు జైలు శిక్ష తప్పదు. అదే విషయం దాచిపెట్టి సీక్రెట్‌గా చేసుకుంటే మాత్రం 10 ఏళ్లు జైల్లో చిప్పకూడు తినాల్సిందే. ఎమ్మెల్యేలందరి సపోర్ట్‌తో ఈ కీలక బిల్లు పాస్ అయ్యింది' అని సీఎం తెలిపారు.