అంకురార్పణతో ప్రారంభమైన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

అంకురార్పణతో ప్రారంభమైన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఈ మేరకు ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. కాగా, ఈ ఉత్సవాలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్ర‌హణం, వాస్తు పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హించారు.