ఈ ఎస్ ఐ ఆస్పత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన పెద్దపెల్లి ఎంపీ
PDPL: రామగుండంలో ప్రతిపాదిత ESI ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పెద్దపల్లి MP వంశీకృష్ణ పరిశీలించారు. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో MPతో పాటు నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఆసుపత్రిని నిర్మిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది నుంచి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవియా సూచనలతో నిర్మిస్తున్నామన్నారు.