ఆపరేషన్ సింధూర్‌పై స్పందించిన మంత్రి సత్యకుమార్

సత్యసాయి: ఆపరేషన్ సిందూర్ కింద పీఓకే, పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ జై హింద్ అని ట్వీట్ చేశారు. మన దేశంలో శాంతికి ముప్పు కలిగించే వారికి శక్తివంతమైన సందేశాన్ని పంపామని అన్నారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వమే దీనికి నిదర్శనమని మంత్రి కొనియాడారు.