ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆశా వర్కర్ల నిరసన
హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్డులో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 1000 మంది జనాభాకి ఒక ఆశా కార్యకర్తను నియమించాలని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల ధర్నాకు BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలన్నారు.