ఎస్పీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎస్పీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

NRPT: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కులకు మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ గారి చిత్ర పటానికి ఎస్పీ యోగేష్ గౌతమ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.