VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గుడివాడలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ గౌరీ శంకరపురంలోని కార్ల స్టాండ్ రోడ్డు అభివృద్ధి పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు. CRDA నిధులు రూ.99.09 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు.