ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు

NDL: నంద్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం సమస్త మానవాళికి ఆదర్శమని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషకరమని, ఆయన గురించి ఈ తరం వారు తెలుసుకోవాలన్నారు.