'పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

HYD: ప్రతి ఒక్కరూ పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం నార్సింగి మున్సిపాలిటీ, మంచిరేవులలో కొత్తగా ఏర్పాటు చేసిన పోస్టాఫీస్ శాఖను ఆయన ప్రారంభించారు. పోస్టాఫీస్‌లో పొదుపు, రుణాలు, నగదు ట్రాన్స్‌ఫర్ లాంటి అనేక సేవలు అందిస్తున్నారన్నారు.