క్యాన్సర్ నియంత్రణపై అవగాహన ర్యాలీ

క్యాన్సర్ నియంత్రణపై అవగాహన ర్యాలీ

NDL: సిరివెళ్ల మండల కేంద్రంలో ఇవాళ క్యాన్సర్ నియంత్రణపై కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థుల చేత అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి శస్త్ర చికిత్స చేయించుకోవాలని ప్రిన్సిపల్ జ్యోతి అన్నారు. నవంబర్ 7న క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తారని ఆమె అన్నారు. ప్రభుత్వం క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.