అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మన్యం: పాలకొండ మండలం కొండాపురం గ్రామ పరిధిలో శనివారం జరిగిన "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్" కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ పాల్గొన్నారు. పాలకొండ నియోజకవర్గంలో గల 33,107 మంది రైతులకు మొదటి విడతలో రూ. 7 వేలు వారి ఖాతాలో జమ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుకు రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 23.17 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.