అనంతను సస్యశ్యామలం చేస్తాం: ఎంపీ
ATP: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేయడమే CM చంద్రబాబు సంకల్పమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. యాడికిలో జరిగిన 'జలధార' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంచడానికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. హంద్రీనీవా కాలువలను విస్తరించాలని, తాడిపత్రిలో కోల్డ్ స్టోరేజ్, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.