బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

E.G: పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ప్రజల స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.