ముంగర్లపాలెంలో 'పొలం పిలుస్తోంది'

ముంగర్లపాలెంలో 'పొలం పిలుస్తోంది'

AKP: గొలుగొండ మండలం ముంగర్లపాలెంలో మండల వ్యవసాయాధికారి కే.సుధారాణి బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ సాగులో తీసుకోవలసిన మెలుకువలు, సస్యరక్షణ, చీడపీడ నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా అధిక వర్షాలు వల్ల పంటలకు ఎదురయ్యే సమస్యలపై పలు సూచనలు చేశారు.