గంజాయి తరలిస్తున్న ఆరుగురు అరెస్ట్
VSP: అరిలోవ పరిసర ప్రాంతాల్లో ముందస్తు సమాచారంతో సీఐ మల్లేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6.250కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.