‘విదేశీ నేతలు కలవకుండా అడ్డుకుంటున్నారు’
విదేశీ నేతలను ప్రతిపక్ష నేత(LoP) కలవకుండా మోదీ సర్కార్ అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వాజ్‌పేయి, మన్మోహన్ హయాంలో ఉన్నటువంటి ఈ సంప్రదాయాన్ని కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. విదేశీ నాయకులు తనను కలవకూడదని ప్రభుత్వమే చెబుతోందని ఆరోపించారు. ప్రతిపక్షం కూడా భారత్‌ను రిప్రజెంట్ చేస్తుందని, మోదీ అభద్రతా భావానికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు.