నేటి నుంచి ఢిల్లీలో కొత్త నిబంధనలు
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు తీసుకుంటుంది. BS-6 ప్రమాణాలు లేని ఇంజిన్ వాహనాలు ఇవాళ్టి నుంచి ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్డని ఆదేశించింది. ఈ నిబంధనలను అమలు చేసేందుకు 126 చెక్‌పోస్టుల వద్ద 580 మంది పోలీసులు, 37 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మోహరించాయి.