ఉప ప్రధానిగా హోమ్ మినిస్టర్ గా విశిష్ట సేవలు అందించాడు
SRCL: సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఏకీకరణ కోసం పాటుపడ్డారని ఇటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని సరదాపూర్ బెటాలియన్‌లో వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత తొలి ఉప ప్రధానిగా హోం మినిస్టర్‌గా దేశానికి విశిష్ట సేవలు చేశారని కొనియాడారు.