అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి

అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి

VZM: బొబ్బిలి పట్టణం జండా మహల్ జంక్షన్ వద్ద దాడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అపశృతి దొర్లింది. పట్టణంలో మంగళవారం రాత్రి గ్రామ దేవత శ్రీ దాడితల్లి సిరిమాను ఊరేగింపు జరుగుతుండగా అంటిపేట జయరాం అనే యువకుడుపై సిరిమాను రథచక్రం పైనుండి వెళ్లడంతో కాలు విరిగింది. తనని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కి సీఐ సతీష్ కుమార్ తరలించారు.