మే 12 నుంచి చిత్తూరు గంగమ్మ జాతర
CTR: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర మే 12, 13 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జాతర వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు తెలిపారు. మే 5న గంగమ్మ జాతర చాటింపు, 12న జాతర తొలి పూజలు చేస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం మహా కుంభ నైవేద్యం సమర్పిస్తామన్నారు. 13న నిమజ్జనం జరుగుతుందని తెలిపారు.