ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపటి వరకే ఛాన్స్

SRD: ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు రూ. 1000 ఫైన్‌తో చెల్లించేందుకు దరఖాస్తు గడువు గురువారంతో ముగియనుందని సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ బుధవారం తెలిపారు. ఇంకా ఎవరైనా విద్యార్థుల చెల్లించకుంటే రేపటి లోగా సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.