'వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి'

KMM: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే వ్యవసాయ నల్ల చట్టాలను కేంద్రం తక్షణమే రద్దు చేయాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం వ్యవసాయ రంగం సమస్యలపై రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం R&B గెస్ట్ హౌస్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.