'బాధితుల సమస్యల పరిష్కరించడమే లక్ష్యం'

కృష్ణా: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. చట్టపరంగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విని, అవసరమైతే కేసులు నమోదు చేసి సహాయం అందిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు.