VIDEO: బంగారుపాళెంలో టైరు పేలి లారీ బోల్తా
CTR: బంగారుపాళెంలోని కాటప్ప గారి పల్లి సమీపంలో టైరు పేలి లారీ బోల్తా పడింది. శుక్రవారం రాత్రి బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.