భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

CTR: పుంగనూరు అర్బన్ ఓల్డ్ బైపాస్ రోడ్డులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేసిన భక్తులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. అర్చకులు వ్రత కథ యొక్క వృత్తాంతాన్ని చదివి వినిపించారు. అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.