దాడికి గురైన నేతను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు
NDL: దొర్నిపాడు(మం), కొండాపురం గ్రామ వైసీపీ నేత, కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై ఆళ్లగడ్డ శివారులో గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. నంద్యాలలోని ఉదయానంద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శివరామిరెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఆయనకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.