జిల్లాలో మూతపడిన చికెన్ షాప్‌లు

జిల్లాలో మూతపడిన చికెన్ షాప్‌లు

NRPT: జిల్లాలో ఇవాళ నుంచి చికెన్ షాపులను మూసివేస్తున్నట్లు షాప్ యజమానులు తెలిపారు. పౌల్ట్రీ కంపెనీలు కమీషన్‌ను తగ్గించడంతో తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని, ప్రస్తుతం లాభాలు లేకపోవడంతో వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు. తగ్గించిన మార్జిన్‌ను పునరుద్ధరిస్తే తిరిగి షాపులను తెరిచి వ్యాపారం ప్రారంభిస్తామని యజమానులు స్పష్టం చేశారు.