కొద్దిసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది: జనసేన
CTR: జనసేన పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిపై Xలో సంచలన ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా 1968 గెజిట్ ప్రకారం 103 ఎకరాల అటవీ భూమి 76 ఎకరాల 98 సెంట్లుగా ఎలా మారిందో వివరించాలని, 32 ఎకరాల 63 సెంట్ల అటవీ భూమి కబ్జా చేసి, చట్టం నుంచి తప్పించుకోవడం సులభం కాదని పేర్కొంది. అయితే త్వరలో కబ్జా చిట్టా, పండ్ల తోటల వివరాలు బయటపెడతామన్నారు.