ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు: అదనపు కలెక్టర్
NLG: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తిప్పర్తి మండలం కేశరాజుపల్లిలోని పీఏసీఎస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. 17 శాతం తేమతో, తాలు, తరుగు లేకుండా ఉన్న ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం చేయవద్దని ఆయన సూచించారు.